• ఎన్నడు లేనిది ఎన్నికల వేళ ఆసాములకు ఆఫర్లా…?
• గత 2నెలల క్రితం వరకు ఆసాములను ఖాతరు చేయని యజమానులకు,ఇప్పుడు ప్రేమెల పుట్టుకొచ్చిందని పట్టణంలో చర్చ…..?
• ఆసామికి10 వేలు ఇవ్వాలని 2 కోట్లు పంపితే,యజమానులు దావతులతోనే సరిపెడుతున్నారంటూ విసుర్లు..?
• ఓట్ల కోసమే ప్రేమ పుట్టిందంటున్న కొంతమంది ఆసాములు.
నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం) :
ఏన్నడు లేనిది..ఎన్నికల వేళ..ఆసాములకు ఆఫర్లా…? అవును !నిజమేననే సందేహాలు తలెత్తుతున్నాయి. నిన్నటి రోజు (శనివారం)సిరిసిల్లా పట్టణంలోని బి.వైనగర్ లో గల ఓ హోటల్ వద్దకు కాఫీ తాగుదామని వెళ్ళిన
నేటి భారతం(ప్రశ్నించమే పరిష్కారం)రిపోర్టర్ కు ఓ ఆసక్తికరమైన చర్చ వినిపించింది. విషయమేదో తెలుసుకుందామని కాఫీ తాగుతూ, ఓ చెవి అటేయడంతో చర్చలోని విషయాలు తెలుసుకోవడం జరిగింది.చర్చలోని అంశాల ఆధారంగా, నిన్న మొన్నటి వరకు ఆసాముల బాధలను పట్టించుకొనే వారు లేరని, ఫలితంగా ఆసాముల చేతిలో ఉన్న పలు సాంచాలను సైతం అమ్ముకున్న విడియోలను మనం సామాజిక మాధ్యమాల్లో చూసాం.అలాంటిది,ఎన్నికల వేళ ఆసాముల అలక తీర్చాలని “ఎక్కడి నుండో ” 2 కోట్లు వచ్చాయని, ప్రతి ఆసామికి 10 వేలు ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు తెలియవచ్చింది.ఇదిలా ఉండగా కోట్లకు పడగలెత్తిన కొంతమంది ‘భడ’సేట్లు 10 వేలు కూడ ఇవ్వకుండా దావత్ లకు,పిలిచినట్లు అ దావత్ తోనే చేతులు దులుపుకొనే పనిలో ఉన్నట్లు చర్చలోని సారాంశం.
5 ఎండ్లలో ఎం చేయకున్న పర్వాలేదు కాని ఆఖరి చివరి రోజుల్లో డబ్బులు పంచితే అందరు అన్ని మరచిపోతారని నాయకుల,పాలకుల ఆలోచన కాబోలు. కాని రోజులు మారాయని ,రానున్న ఎన్నికల్లో ప్రజలు అది నిజం చేయబోతున్నారని, పాలకులు శ్రద్దగా గమనించే సమయం దగ్గర్లోనే ఉందనేది వాస్తవం.











Leave a Reply