నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం)
ఎన్నికల వేళ..ఆసాములకు ఆఫర్లు కాదని,అంత అభిమానంతోనేనని, రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని సిరిసిల్లాలోని ఓ భడ పవర్ లూం వ్యాపారి నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం)జిల్లా
ప్రతినిధికి చరవాణి ద్వారా తెలిపారు. చరవాణిలో ఆయన మాట్లాడుతూ, తాము ఎవరికి ఆఫర్లు ఇవ్వడం లేదని, కేవలం అభిమానంతోనే నని తెలిపారు. నష్టాల్లో ఉన్న సిరిసిల్లా పవర్ లూం రంగంలో సమూల మార్పులు తెచ్చింది కేటిఆరే నని అందుకే, తమ వంతు అభిమానం తెల్పుతున్నామని తెలిపారు.సాధారణ చేనేత కార్మికులుగా ఉన్న తాము,ఈ స్థాయిలో ఉన్నామంటే కేటిఆర్ చూపించిన ఉపాధి మార్గాలే నన్నారు. ఆసాములకు అందజేయడానికి కొంత నిధి వచ్చిందని జరుగుతున్న ప్రచారం నిజం కాదా అని అడిగిన ప్రశ్నకు బదులుగా ,తమ వద్దకి ఏ నిధి రాలేదని ,పవర్ లూం రంగానికి ప్రభూత్వం అందిస్తున్న అవశాకాలకు , చిరు సత్కారంగా అభిమానంతోనే ఆసాములను పిలుచుకున్నామే తప్ప తామేమి డబ్బులు పంచడం లేదని పేర్కొన్నారు.











Leave a Reply