* దాసు సురేష్ ,అధ్యక్షులు బీసీ రాజ్యాధికార సమితి .
నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం)
మోసాలకు ద్రోహానికి కేరాఫ్ కేటీఆర్ అని బి.సి రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. సోమవారం సిరిసిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల లో 400 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారని , సొంత జిల్లా కరీం నగర్ చొప్పదండి లో ఒకేరోజు ముగ్గురు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నా స్పందించని, మంత్రి కేటీఆర్ కు ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. చేనేత శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్.. సిరిసిల్లలోని నేతన్నలను బతుకమ్మ చీరల ముసుగులో మోసం చేసి, నకిలీ పట్టు చీరల కాంట్రాక్టులు పక్క రాష్ట్రాల లోని తన చీకటి మిత్రులకు ఇప్ప్పించి, వేల కోట్ల వ్యాపార లావాదేవీలలో కమీషన్లు పొందారన్నారని ఆరోపించారు. ఈ కారణం వల్లనే రాష్ట్రంలో చేనేత రంగం కుదేలయ్యి ,తెలంగాణా ఏర్పాటు సమయంలో ఉన్న 400 పై చిలుకు సహకార సంఘాలు నేడు వందకు పరిమితమయ్యాయని ఆవేదన చెందారు. సహకార సంఘాలకు పదేళ్లుగా ఎన్నికలు నిర్వహిచకుండా, పద్మశాలి నాయకత్వాన్ని నిర్వీర్యం చేశాడని కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. సిరిసిల్ల నేతన్నలకు 200 రూపాయల బతుకమ్మ చీరల కాంట్రాక్టులు… పక్క రాష్ట్రంలో నకిలీ చీరలకు వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చిన చరిత్ర కేటీఆర్ దని ఆరోపించారు. టెస్కో షోరూమ్లను ప్రారంభించాల్సిన మంత్రులు… కార్పోరేట్ షాపింగ్ మాల్స్ ను ప్రారంభిస్తూ చేనేతలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేతలను ఆదుకోని కేటీఆర్… పక్క రాష్ట్రాల్లో పంజాబ్ హర్యానాలో బాధితుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల అందించడం ఏ విధంగా న్యాయమని ప్రశ్నించారు. షాపింగ్ మాల్స్ మోసాలకు పాల్పడుతుంటే చేనేత మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా కార్పొరేట్ స్నేహితులకు మేలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇటీవల పోచంపల్లి ఇక్కత్ చీరలను పవర్ లూమ్ పై నేసి హ్యాండ్లూమ్ మార్క్, సిల్క్ మార్క్, ను పేర్కొనకుండా
నకిలీ చీరను విక్రయించి దేశ ప్రతిష్టను గంగపాలు చేసిన వరంగల్ లోని ఒక ప్రముఖ షాపింగ్ మాల్ పై కేంద్ర ఎంఫోర్సుమెంట్ అధికారులు దాడి చేసి పట్టుకుంటే కేటీఆర్ తన అధికారంతో ఆ సంస్థపై కేసు కాకుండా నివారించి అక్రమానికి పాల్పడ్డారన్నారని విమర్శించారు .ఈ కార్యక్రమంలో చేనేత మహిళలు శ్యామల సుమతి, సింగం సంధ్య, గంజి కోమలి, చెల్లా మాణిక్యం, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు బండారు పద్మావతి, కార్యదర్శి మిర్యాల శ్రీలత, రాష్ట్ర కమిటీ సభ్యులు బలరాం, రాష్ట్ర యువజన కన్వీనర్ మడత కిషోర్ తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply