
• ఏళ్ల తరబడి సిరిసిల్ల మెప్మా లో పాతుకు పోయిన సి.ఓ లు.
• డిజిటల్ mcp లేకుండా నే లోన్లు లు ఇప్పిస్తున్న పలువురు సి. ఓ లు.
• సి. ఓ లు క్లస్టర్ దాటి offline mcp పై సంతకాలు చేయడం వెనుక మర్మమేమిటి..?
•ఆర్. పి ల ప్రమేయం లేకుండానే లోన్ లు ఇప్పిస్తున్న పలువురు సి. ఓ లు.
* ప్రక్షాళన చేయకుంటే కోట్ల కుంభకొనానికి తెర లేవడం ఖాయం.
“నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Oct 26, 2024.
ఎలాంటి బదిలీలు లేకపోవడం తో ఏళ్ల తరబడి సిరిసిల్ల మెప్మా లో సి.ఓ లు. పాతుకు పోయి, నా, మా అనే వారికీ ఎలాంటి డిజిటల్ mcp లేకుండా, సిరిసిల్ల HDFC బ్యాంక్ లో మహిళ సంఘాలకు రుణాలు ఇస్తున్నారని విశ్వాసనియా సమాచారం.వీరు ఇప్పిస్తున్న లోన్ లలో పలు ఫైల్ లలో “ఆర్. పి’ ల ప్రమేయమేలేదంటే, సి. ఓ ల పాత్ర పై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సి. ఓ లు HDFC బ్యాంక్ లో ఇప్పించే లోన్ లో ఎంతమంది అర్హులు, ఎంత మంది అనర్హులు ఉన్నారనేది అ “పెరుమాళ్ళకే’ తెలుసు.గత కొద్దీ రోజుల వరకు పలువురు సి. ఓ ల మధ్య సఖ్యత లేకుండేదని, ప్రస్తుతం కొంత మంది ఓ గ్రూప్ గా వారు రాసిందే, రాతగా? పెట్టిందే ఫైల్ గా వీరి వ్యవహారం సాగుతుందని “మెప్మా’లోని పలువురు ఆర్. పిలు గుసగుసలాడుకుంటున్నారు.సిరిసిల్ల పట్టణం లోని పలువురు కౌన్సిలర్లు ఈ సి. ఓ లకు అభయహస్తం ఆడిస్తుండటం వల్లే వీళ్ళ తతంగం బయటికి రావడం లేదనే వాదనలు ఉన్నాయి.ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మెప్మా వైపు చూస్తే అన్ని విషయాలు బయటపడతాయని, మెప్మా లో కోట్ల కుంభకోణం జరగక ముందే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని “నేటి భారతం” ఉద్గటిస్తుంది.











Leave a Reply