“నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Oct 25, 2024.
వర్జినల్ బాంబులకే భయపడలేదు, గీ సుతిల్ బాంబులకు భయపడ తానా.? అని సిరిసిల్ల ఎం.ఎల్. ఏ కేటీర్ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణం మండపం లో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పై బహిరంగ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమా నికి హాజరైన కేటీర్, అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అయన మాట్లాడుతూ! ఉచిత విద్యుత్ పేరుతో కాంగ్రెస్ ఉన్నా విద్యుత్ పోగొట్టేందుకు ప్రయత్నం చేస్తుందని, పేద, మధ్య తరగతి కుటుంబాల నడ్డి విరిచేందుకు ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.అదని, అంబానీ లకు సిరిసిల్ల నేతన్న లకు ఒకే కేటగిరి అంటే ఎలా అని ప్రశ్నించారు.దేశంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చామని,పైసా పెంచలేదని,ఇప్పుడు కరెంట్ కోతలు, విద్యుత్ చార్జీల భారం ఎలా అవుతుందో చెప్పాలన్నారు.సిరిసిల్ల లో గత పదేళ్లుగా ఆత్మహత్యలు లేవని, కానీ ఈ 10 నెల్లలో 10 మంది చనిపోయారని దుయ్యబట్టారు. సిఎం బుర్ర,బుద్ధి మార్చుకోవాలని హితావు పలికారు.దీపావళి ముందే బాంబులు పెళుతాయని అని పొంగులేటి అన్నారని, బహుశా అయన పై జరిగిన ఈడి రైట్స్ కావచ్చని అన్నారు. సి. ఎం ఎం చేస్తారో చేసుకోండని,ఎం పిక్కుకుంటారో పిక్కుకోండని,గి చిట్టి నాయుడు ఎం చేస్తాడని, హౌల గాళ్ళకు భయపడుతానా అని ఏద్దేవా చేశారు.మహా అయితే చిల్లర కేసు పెట్టీ జైలుకి పంపిస్తారు కావచ్చు,వర్జినల్ బాంబులకే భయపడలేదు, గీ సుతిల్ బాంబులకు భయపడతానా అని అన్నారు. జగిత్యాల ఎంఎల్ఏ రాజకీయ వ్యబిచారని , పార్టీ మారిన 10 మంది రాజకీయ వ్యబిచారీలే నని పేర్కొన్నారు.జగిత్యాల లో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులే చంపుకుంటున్నారని,మోడీ నాయకత్వంలో సిఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.











Leave a Reply