ఫిబ్రవరి 10/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
సిరిసిల్ల 18వ వార్డు ‘హస్త’గతమవుతున్నట్లు కనిపిస్తోంది. విద్యావంతుల సంపూర్ణ మద్దతు అధికార పార్టీ వైపే ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థిని గెలుపు దిశగా నడిపించేట్టు ఓటర్లలో మార్పు కనిపిస్తోంది. బీఆర్ఎస్ తన అభ్యర్థిని ఎంపిక చేసిన విషయంలో నాటకీయ పరిణామాలు, సిట్టింగ్ కౌన్సిలర్ కు కేటాయించిన టికెట్ ను ఆఖరి నిమిషంలో రద్దు చేయడంతో ఆ పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురైన విషయం తెలిసిందే. అదే పార్టీకి చెందిన మరో అభ్యర్థికి టికెట్ కేటాయించడంతో ఓటర్లలో గందరగోళం ఏర్పడింది. కాగా విద్యాధికులు, ఉపాధ్యాయులైన గెంట్యాల రేణుక భూమేష్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం కలసి వచ్చినట్లు చర్చ జరుగుతోంది. వార్డులో ఉన్న మెజారిటీ కుటుంబాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు విద్యావంతుల మద్దతు లభించడం ఖాయం గా కనిపిస్తోంది. ఈసారి విద్యాధికులకు కౌన్సిలర్ గా పట్టం కట్టాలనే నిర్ణయానికి ఓటర్లు వచ్చినట్లు తెలుస్తోంది. విస్తృతంగా ఉన్న ప్రజా సంబంధాలు,ఉన్నతమైన వ్యక్తిత్వం, సమాజ సేవపై నిబద్ధత కారణంగా కాంగ్రెస్ అభ్యర్థికి సానూకుల అంశాలు.కాగా గతంలో బీజేపీ అభ్యర్థి కేవలం స్వల్ప ఓట్లతో ఓడిపోయానని, ఈసారి అవకాశం ఇవ్వాలని ప్రచారం చేయడం, మరో స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉంటూ, ఓట్లు చీల్చే అవకాశం ఉండడం కూడా కాంగ్రెస్ అభ్యర్థికీ కలిసివచ్చేలా ఉంది. దీంతో ఆ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.











Leave a Reply