



* కోట్ల విలువ చేసే ప్రభుత్వ ధాన్యం పక్కదారి.
* అమ్ముకున్నట్లు సివిల్ సప్లై అధికారులు ధృవీకరించిన చర్యలు శూన్యం.
• రైస్ మిల్లర్ల వ్యవహారంలో అధికారుల తీరు పై అనుమానాలు.
• ప్రభుత్వ సోమ్ము రాబడతారా..?చూసి చూడనట్టు వదిలేస్తారా…?
• అరెస్ట్ లు కాదు… ఆస్తులు అటాచ్ చేయాలి.
మార్చి 15/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం రైస్ మిల్లర్లకు ఇచ్చే ధాన్యాన్ని, మిల్లర్లు అమ్ముకున్న అడిగేవారు లేకుండా పోయారు. పేదలకు అందించే రేషన్ బియ్యo కొరకు, ప్రభుత్వం రైతుల నుండి ఐకేపీల ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైస్ మిల్లర్లకు అందిస్తుంది. మిల్లర్లు ఆ వరి ధాన్యాన్ని బియ్యం గా మార్చి ప్రభుత్వానికి నిర్ణీత గడువు లోగా అందించాలి. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొంతమంది రైస్ మిల్లర్లు ప్రభుత్వ నుండి తీసుకున్న వరి ధాన్యాన్ని, అమ్మేసుకొని కోట్లు దండుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంలో పలు రైస్ మిల్లులపై జిల్లా సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించి, పలువురు రైస్ మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని అమ్ముకున్నట్లు పంచనామా కూడా చేసారు. అయినా అలాంటి వారిపై చర్యలు లేకపోవడంతో మరికొందరు ధాన్యాన్ని అమ్ముకుంటే ఏమవుతుంది..?అమ్ముకున్న వారి పై చర్యలే లేవు, మన పై చర్యలు తీసుకునే నాటికి చూసుకుందాంలే అనుకుంటూ మరి కొంత మంది రైస్ మిల్లర్లు ధన్యాన్ని అమ్ముకొనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలియవచ్చింది.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం కొనయ్య పల్లి లో కన్యకా పరమేశ్వరి రైస్ మిల్ నడుపుతున్న యాజమానులు చేపూరి అంజయ్య, చేపూరి మధుకర్, దొంతుల గణేష్, ఆచంసంతోష్, ప్రభుత్వ వరి ధాన్యం అమ్ముకొని కోట్లు వెనకేసుకున్నట్లు సమాచారం. ఇలా జిల్లాలోని, తంగళ్ళపల్లి మండలంలో కామాఖ్య దేవి ఇండస్ట్రీస్ గండి రాజపేట. నవభారత్ ఇండస్ట్రీస్, రగుడు. నవభారత్ రైస్ మిల్ తంగళ్ళపల్లి, నవభారత్ రైస్ మిల్, సిరిసిల్ల. అన్న ఆఫీజ్ రైస్ మిల్ కొలనూరు, శివ రైస్ మిల్ చెక్కపల్లి, ఇలా ఒక్కొక్క రైస్ మిల్లర్ యజమాని 5 నుండి10 కోట్లు వెనకేసుకున్నట్లు ఆయా వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతుంది.ఇదిలా ఉండగా పక్క జిల్లాలు అయినా జగిత్యాల, నిజామాబాద్, పెద్దపెల్లిలలో ప్రభుత్వ వరి ధాన్యాన్ని పక్కదారి పట్టించిన వ్యాపారులపై పోలీస్ కేసులను నమోదు చేస్తూ, వారి ఆస్తులను ప్రభుత్వానికి అటాచ్ చేస్తున్నారు.కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారుల అనుగ్రహమో, లేక రాజకీయ నాయకుల ప్రోత్బలంమో తెలియదు కానీ, ప్రభుత్వ దాన్యాన్ని అమ్ముకున్న ఏ ఒక్క రైస్ మిల్లర్ పై నేటి వరకు చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రభుత్వ వరి ధాన్యాన్ని అమ్ముకున్న అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు చేపడితేనే ప్రభుత్వం పై విశ్వాసం ఉంటుందని నేటి భారతం ఉద్ఘటిస్తుంది. మరి విప్ ఆ విధమైన చర్యలు చేపడతారా….? లేదా??వేచి చూడాలి.











Leave a Reply