మార్చి 11/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
సెస్ ఉద్యోగ, కార్మికులు వారి సమస్యలపై 72 గంటల విధుల బహిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ అన్ని క్యాడర్లలో గల ఉద్యోగులకు తక్షణమే ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్ (VEW)గా విధులు నిర్వహిస్తున్న సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఇచ్చిన కారుణ్య నియామకాలను ఇప్పటివరకు రెగ్యులరైజ్ చేయలేదని, వాటిని వెంటనే రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేసారు. సెస్ పరిధిలోగల కార్మికులకు ఉద్యోగులకు ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ గతంలో చెల్లించేవారని,వాటిని మళ్లీ పునరుద్ధరించాలని డిమాండ్ చేసారు.ప్రతి ఉద్యోగికి న్యాయమైన రక్షణ పరికరాలు అందించాలని,అసిస్టెంట్ హెల్పర్ అనే పేరును జేఎల్ఎం గా మార్చాలన్నారు.2025 నవంబర్ నుండి ఉద్యోగులకు Annual Grade Increment ఇవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ యూనిటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ ) రాష్ట్ర అధ్యక్షులు కే. ఈశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వాk మి, జిల్లా అధ్యక్షులు కర్నాల అనిల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్రా శ్రీనివాసరెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎగుమంటి ఎల్లారెడ్డి, మల్లేశం, రాంబాబు, టి. అనిల్ కుమార్, కిషన్, పి మల్లేశం, ఏ శ్రీనివాస్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply