‘ప్లాస్టిక్’ ను పాలక వర్గం పట్టించుకునేనా..?

Published by

on

పట్టణంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న ప్లాస్టిక్.

మార్చి 10/26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

సిరిసిల్ల మున్సిపల్లో కొత్తగా కొలువు తీరిన పాలక వర్గం ప్లాస్టిక్ సమస్యను పట్టించుకునేనా..?అని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.ప్లాస్టిక్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించి ఏళ్ళు గడుస్తున్న,ముగ్గురు కమీషనర్లు, రెండు పాలక వర్గాలు మారిన, గత కమీషనర్ రమణచారి హయాంలో తప్ప ఎవ్వరు ప్లాస్టిక్ నియంత్రణ ను పట్టించుకొనే పాపాన పోలేదు.సిరిసిల్ల మున్సిపల్ శానిటేషన్ ఆటో, ట్రాక్టర్ల తో ప్రచారాలే తప్ప, ఆచరణను ఎక్కడ చూపలేదు.అడిగే వారు లేరని, అడిగితే చూద్దాంలే అనే విధంగా మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.పేరుకు మాత్రమే సిరిసిల్లాలో ప్లాస్టిక్ నియంత్రణ, కాని ప్రతి పని ప్లాస్టిక్ తోనే జరుగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెట్ లో క్యారీ బాగ్స్, ఫంక్షన్ హాల్లో ప్లేట్స్, గ్లాస్ లు, కూరగాయల వ్యాపారంలో, పూల దండల షాప్ ల్లో ,మటన్, చికెన్, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, ఫిష్ మార్కెట్ లో కూడా భారీగా ప్లాస్టిక్ కవర్లను, బ్యాగ్ లను వినియోగిస్తున్నారు.ఇంత యదేచ్చగా ప్లాస్టిక్ వినియోగం జరుగుతుంటే మున్సిపల్ అధికారుల వ్యవహార తీరును అనుమానించక తప్పడం లేదు. ప్రజల కోసం కాకపోయినా, కనీసం కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టానైనా గౌరవించి,పాలక వర్గం ప్లాస్టిక్ నియంత్రణ అమలు జరిగేలా చూడాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ లో భాగంగా సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ వద్ద సిరిసిల్ల పట్టణానికి జాతీయ స్థాయి అవార్డ్ రావడానికి అందరు కృషి చేయాలనీ పిలుపునిచ్చినా ఛైర్పర్సన్, కమీషనర్లు పట్టణం మొత్తం ప్లాస్టిక్ సంచులు వాడుతుంటే  అవార్డ్స్ ఎలా వస్తాయని భావిస్తున్నారో భోదపడటం లేదు. ఈ ప్లాస్టిక్ నియంత్రణ విషయంలో నూతన పాలకవర్గం ఎలా  స్పందిస్తుంది…? ఎం చేస్తుంది…? ఎలా నియంత్రిస్తుంది…? వేచి చూడాలి మరి.

Leave a Reply

March 2026
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading