
మార్చి 10/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
‘అతివలు’ ఆకాశంలో సగమని, అవకాశామిస్తే అన్ని రంగాల్లో రానిస్తారని 15వ వార్డ్ కౌన్సిలర్ కూర భాగ్య లక్ష్మి అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలోని, అంబేద్కర్ నగర్ కమాన్ వద్ద వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలకు సత్కారం చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ, మహిళల్ని ప్రోత్సహించాలే గాని, వారు సాధించని విజయాలంటూ ఉండవు. అంతరిక్ష పరిశోధనలో సైతం మహిళలు రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ -1,ఇలా పోటీ పరీక్షల్లోనే కాకుండా, క్రీడల్లో సైతం దేశానికి ఎనలేని సేవలందిస్తున్నారు. ఇంట్లో ఇల్లాలుగా, పిల్లలకు తల్లిగా, సమాజంలో బాధ్యత గల మహిళగా రాణిస్తూనే, దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు మహిళలు. ఈ సందర్భంగా ప్రతి మహిళకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.











Leave a Reply