మటన్ @900…సిరిసిల్ల లో మాత్రమే…?

Published by

on

మార్చి 09/26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

ధరలు ఏ అధికారి పెంచమన్నారో, ఎవరు పెంచతున్నారో తెలియదు కానీ సిరిసిల్ల లో మాత్రం మటన్ మాంసం కేజీ 900 అయ్యింది.తెలంగాణ ప్రభుత్వం 21 జనవరి 2021 న మటన్ ధర 700/-గా నిర్ణయించింది.కానీ అవేవి పట్టించుకోకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మటన్ షాప్ నిర్వహకులు మాత్రం మటన్ కేజీ ధరను అమాంతం 900/- చేసారు.గత దసరా పండగ రోజున కేజీ మటన్ 800/-చేసిన, కార్మిక క్షేత్రం కనుక కార్మికులు ప్రశ్నించలేరని  మరో 100/-రూపాయలు ధర  పెంచారు వ్యాపారులు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాను ప్రకారం వస్తువుల నాణ్యత, ధరల నియంత్రణన చేయాల్సిన మున్సిపల్ సంస్థ, మాకు పిర్యాదు అందితేనే స్పందిస్తామన్నట్లుగా ఉన్నారు.సాధారణ పద్ధతుల్లో వ్యాపార సంఘం (association) మీటింగ్ చేసి, ధర నిర్ణయాన్ని మున్సిపల్ అధికారులు లేదా మార్కెట్ కమిటీకి సమాచారం ఇవ్వాలి.అవేవి చేయకుండా మటన్ వ్యాపారాలు ధరలు పెంచారు.ఇదిలా ఉండగా పక్కనే ఉన్న దైవ క్షేత్రం వేములవాడలో మాత్రం మటన్ ధర 800/- ఉంది. మరి వారికి లేని కొరత సిరిసిల్ల పట్టణ మటన్ వ్యాపారులకు ఎలా వచ్చింది అనేది ప్రశ్నగా మారింది.ఈ విషయంపై మున్సిపల్ ఛైర్పర్సన్, కమీషనర్ సిరిసిల్ల ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

Leave a Reply

March 2026
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading