

మార్చి 17/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
అవును మీరు చదువుతున్నది నిజమే.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలువురు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ‘బియ్యం’ సొమ్ము 165 కోట్లు.165కోట్లు ఏందీ అనుకుంటున్నారా..?అవును మీరు చదువుతున్నది నిజమే,ప్రతి సీసన్ లో రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసిన లక్షల క్వింటాళ్ల వరి దాన్యాన్ని, రైస్ మిల్లర్లకు అందిస్తే, మిల్లర్లు వాటిని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అందించాలి. ఆ బియ్యాన్ని ప్రభుత్వము పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా పంచుతుంది.ఇలా ప్రభుత్వం 2024-2025 సంవత్సరంగాను అందించిన వరి ధన్యాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా లోని 40 మంది రైస్ మిల్లర్లు పక్క దారి పట్టించి చేసుకున్న సొమ్ము 165కోట్లు. ప్రభుత్వానికి ఇంత బకాయి ఉన్న సంబంధిత జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై అధికారులు నేటి వరకు ఏలాంటి చర్యలు చేపట్టలేదు.పక్క జిల్లాలైన జగిత్యాల, నిజామాబాద్, పెద్దపెల్లి, కరీంనగర్ లలో ఇలాంటి రైస్ మిలర్లను అరెస్ట్ చేసి, ఆస్తులు ప్రభుత్వానికి అటాచ్ చేస్తుండగా మన జిల్లాలో మాత్రం సంబంధిత అధికారులు ఇవేవి పట్టనట్టుగా మౌన వ్రత్రం చేస్తున్నారు.వ్రత్రం చేయడానికి ఇది శ్రావణమాసం కాకా పోయిన, అధికారుల మౌన వ్రత్రం ఎవరికోసం చేస్తున్నారో అర్థం కావడం లేదు.ఇదిలా ఉండగా అధికారుల వ్రత్రం రైస్ మిలర్లకు కలిసచ్చేలా ఉంది.అధికారులు చర్యలు చేపట్టేలోపు సదరు రైస్ మిల్లర్లు అరెస్ట్ లు చేయకుండా హైకోర్టు నుండి ఆర్డర్ లు తెచ్చుకునే పనిలో ఉన్నట్లు పక్క సమాచారం.ప్రభుత్వాన్ని మోసం చేసిన సగటు సామాన్యులపై బ్రహ్మాస్త్రాలు ప్రయోగించే అధికారులు వీరి విషయంలో ఎందుకు ఇంత ఉదాసినంగా ఉన్నారో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలోచించాలని పలువురు సామజిక వేత్తలు కోరుతున్నారు. మరి అధికారులు, రైస్ మిలర్లకు కోర్ట్ ఆర్డర్ వచ్చేదాక చూస్తారా…?ప్రభుత్వం కోసం చర్యలు చెప్పడతారా చూడాలి.











Leave a Reply