తినొద్దని తీర్మానించుకుంటే సరిపోద్ది..!

Published by

on

*నెలకు 2సార్లు తింటే సరిపోద్దనే భావనలో ప్రజలు.

* ప్రత్యామ్నాయంగా చికెన్, చేపలు తిసుకుంటే సరిపోతుందంటున్న వైద్యులు.

• ధరల పెరుగుదల పై  నేటికీ స్పందించని సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్, ఛైర్పర్సన్ లు.

మార్చి 19/26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

సిరిసిల్ల మార్కెట్లో మటన్ ధర రోజు రోజు కి  ఆకాశాన్ని అంటుతుంటే, పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతుండగా, నెలలో 4 సార్లు(ఆదివారం) తినే, మటన్ 2 సార్లు తింటే సరిపోతుందని తీర్మానించుకుంటే సరిపోద్దని మరికొందరు దైర్యం చెప్పుకుంటున్నారు.గత 3వారల క్రితం రాష్ట్రం లో ఎక్కడ లేని విధంగా  సిరిసిల్ల మార్కెట్ లో మటన్ ధర  కేజీ 900/- పెంచారు సదరు మటన్ షాప్ యజమానులు. వాస్తవానికి డిమాండ్, సప్లై, కొనుగోలు,ఖర్చు, లాభం ఆధారంగా వ్యాపారి ధర నిర్ణయిస్తాడు.మేకలు, గొర్రెల ఉత్పత్తి BRS ప్రభుత్వంలో గననీయంగా పెరిగిందని,పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో  అచ్చు వేసి చెప్పింది అప్పటి ప్రభుత్వం. అప్పటి సీఎం కెసిఆర్ యాదవుల అభ్యునతి కొరకు గొర్రెలు, మేకలను అందజేశారు.మేకలు, గొర్రెల మధ్య ప్రత్యుత్పత్తి జరిగి, మేక, గొర్రెల ఉత్పత్తి పెరగడం సహజం. ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు ధరలు తగ్గాల్సింది పోయి, సిరిసిల్ల మార్కెట్లో కిలో మటన్ ధర రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. ఆది కాకా జిల్లాలో గంగాధర, వెంకటాపూర్, పెద్దూర్, ముస్తాబాద్ లో మేకల, గొర్రెల అంగడి జరుగుతుండగా,గత 2నెలల క్రితం జరిగిన మేడారం జాతర తో మేకలు, గొర్రెల కు డిమాండ్ పెరగడంతో ఇదే అదునుగా భావించి మటన్ ధరలు పెంచేసారు సిరిసిల్ల మటన్ వ్యాపారులు.నిబంధనలకు విరుద్దంగా ధరలు పెంచుతుంటే, చర్యలు చేపట్టాల్సిన సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్, ఛైర్పర్సన్ లు నేటికీ స్పందించకపోవడం శోచనీయం. పట్టణం లోని 39 వార్డ్ లలోని ప్రజలు ఓట్లు వేసి, కౌన్సిల్లో తమ సమస్యలు, కష్టాలపై గల మెత్తడానికి పంపిన కౌన్సిలర్లు సైతం ప్రజల కోసం స్పందించక పోవడం విడ్డురంగా ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.ఇకనైనా సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్, ఛైర్పర్సన్ లు స్పందిస్తారో లేదో  వేచి చూద్దాం.

Leave a Reply

March 2026
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading