నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Oct 02, 2024.
రాజన్న సిరిసిల్ల జిల్లా,సిరిసిల్ల ఆర్డీఓ కు హైకోర్టు నోటీసులు పంపినట్లు సామజిక మధ్యమాల్లో వార్త చక్కర్లు కొడుతుంది.
గత వారం రోజుల క్రితం జరిగిన రేషన్ డీలర్ల ఎగ్జామ్ అవకతవకలపై బాధితులు హైకోర్టు గుమ్మం ఎక్కగా, బాధితుల ఎగ్జామ్ ప్రక్రియకు సంబంధించిన కాగితాలను మొత్తం,వచ్చే శుక్రవారం వరకు హైకోర్టుకు సమర్పించాలని ఆర్డీవోకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.ఇదిలా ఉండగా, ఒకవేళ ఆర్డీఓ వాదనలు వినిపించాల్సివస్తే, ఎగ్జామ్స్ నిర్వహించిన సదరు రేషన్ షాప్ లను గతంలో మహిళా సంఘాల కు కేటాయిస్తే, సంఘాల్లో కాస్త ఆర్థికంగా ఉన్న సభ్యుల పతులు, మిగతా 9మంది సభ్యులలతో లాభనష్టాలు తెలపకుండా నాట్ విల్లింగ్ అని పేపర్ పై సంతకం చేయించుకొని, హైకోర్టును ఆశ్రయించి సదరు షాప్ లు నిర్వహిస్తున్నారని,అలా వాటిని దుర్వినియోగం కాకుండా ఉండటానికే, పకడ్బందీగా పరీక్షలు, ఇంటర్వ్యూ నిర్వహించి, షాప్ లు కేటాయించినట్లు తెలిపే అవకాశం ఉంటుందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.











Leave a Reply