
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Oct 04, 2024.
పండుగల సందర్భంగా చీటీలు, ప్రైజ్ మనీ, బహమతుల పేర్లతో పెట్టె ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరు మోసపోవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.జిల్లా లోని చందుర్తి మండల కేంద్రం,తిమ్మాపూర్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా “దుర్గమ్మ విగ్రహాల” వద్ద లక్కీ డ్రా లు నిర్వహిస్తున్న నిర్వహకులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ,దుర్గమ్మ విగ్రహాల వద్దలక్కీ డ్రా నిర్వహిస్తు, ప్రజల వద్దనుండి ఒక్కొక్క లక్కీ డ్రా టికెట్ 99, 200 రూపాయలు వసూలు చేస్తు మొదటి బహుమతిగా రిఫ్రిజిరేటర్, రెండవ బహుమతిగా సైకిల్, మూడో బహుమతి గా రైస్ కుక్కర్, వంటివి ఆశ చూపి డ్రాలో పాల్గొనవలసిందిగా ప్రచారం చేస్తున్న వారి పై కఠిన చర్యలంటాయని తెలిపారు.ఇదిలా ఉండగా వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంలో సిరిసిల్ల పట్టణం లోనే పదుల సంఖ్యలో లక్కీ డ్రా లు నిర్వహించిన, అప్పుడు ఇలాంటి చర్యలు చేపట్టని పోలీస్ శాఖ, ఈ రోజు రెండు “దుర్గ మాత”మండప నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం జిల్లాలో చర్చనియా అంశంగా మారింది.సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సైతం దుర్గ మాత మండపాలు నిర్వహిస్తు, లక్కీ డ్రా నిర్వహిస్తున్న వారి పై సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.











Leave a Reply