నష్టాల్లో సిరిసిల్ల ‘ సెస్ ‘

Published by

on

* సెస్ పరిధిలోని  రైతులను కాపాడాలంటూ  టి జి ఈ ఆర్ సి చైర్మన్ కు వినతి.

* సిరిసిల్ల “సెస్” ను  టిజి ఈ ఆర్ సి లో కలపాలి కిసాన్ సంగ్ జిల్లా అధ్యక్షులు ధ్యాప దేవయ్య.

“నేటి భారతం’ (ప్రశ్నించడమే పరిష్కారం):

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

Nov 06, 2024.

గత ఫిబ్రవరి 2 నాటికి 94 కోట్ల  84 లక్షల 70 వేల 751  రూపాయల నష్టాల్లో  సెస్ ఉందని, కిసాన్ సంగ్ జిల్లా అధ్యక్షులు ధ్యాప దేవయ్య (టి.జి ఈ ఆర్ సి) తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ జస్టిస్ దేవరాజ్ నాగార్జున ను  కోరినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.అక్టోబర్ 30న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ గా (టి జీ ఈ ఆర్ సి ) డాక్టర్ జస్టిస్ దేవరాజ్ నాగార్జున పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా Dr గణేష్ గౌటే( శివసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి) ధ్యాప దేవయ్య  చైర్మన్ కు సిరిసిల్ల సెస్  సంస్థ కు సంబందించిన కొన్ని విషయాలను వివరించిన్నట్లు తెలిపారు. సిరిసిల్ల  సెస్  సంస్థ  లాభాల కంటే నష్టాల్లోనే  ఉందని,  గత ఫిబ్రవరి 2న  నాటికి 94 కోట్ల  84 లక్షల 70 వేల 751  రూపాయల వరకు  నష్టాల్లో ఉందని, ప్రస్తుతం అది వంద కోట్ల నష్టానికి  చేరుకుందని  ఆందోళన వ్యక్తం చేశారు.వెంటనే  సిరిసిల్ల సెస్ ను  టి జి ఈ ఆర్ సి లో కలపాలని, సెస్ పరిధిలోని  రైతులను కాపాడాలని  చైర్మన్ కు  విజ్ఞప్తి చేసినట్లు అయన పేర్కొన్నారు.

Leave a Reply

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading