హ్యాండ్ బాల్ పోటీలకు  రైసింగ్ అకాడమీ క్రీడాకారిణి ఎంపిక.

Published by

on

నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

Nov 01, 2024.

రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలకు  రైసింగ్ అకాడమీ క్రీడాకారిణి ఎంపికైనట్లు శ్రీ కృష్ణ వేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ పల్లె రాజు రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా రాజు రెడ్డి మాట్లాడుతూ!

గత నెల 29న కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి సబ్ జూనియర్ గర్ల్స్, హ్యాండ్ బాల్ పోటీ లు కొత్తపల్లి లోని అకాడమీక్ హైట్స్ పబ్లిక్ స్కూల్లో, కరీంనగర్ హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని, ఈ పోటీలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని  రైసింగ్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతూ,  శ్రీ కృష్ణ వేణి టాలెంట్ స్కూల్ ల్లో 8వ తరుగతి చదువుతున్న కె.జిగిష ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ నెల 2 నుండి 4 వరకు ఆసిఫాబాద్ జిల్లా లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని అకాడమీ హ్యాండ్ బాల్ కోచ్ కృష్ణ హరి తెలిపినట్లు వారు వివరించారు. క్రీడలు పిల్లల జీవితాలలో ప్రధాన పాత్ర పోషిస్తాయని, ఈ తరం పిల్లలు ఆరోగ్య సమస్యలను అధిగమించాలంటే కచ్చితంగా పిల్లలకు క్రీడల్లో పాల్గొనే అలవాటు చేయాలని, పిల్లలు మానసికంగా, శారీరకంగా,ఆరోగ్యంగా ఎదిగేందుకు “స్పోర్ట్స్’ ఉపయోగపడతాయని  తెలిపారు.కె.జిగిష ను స్కూల్ PET లు బాబు, నవీన్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Leave a Reply

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading