* జగిత్యాల టౌన్ సిఐ వేణుగోపాల్.
“నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం):
జగిత్యాల జిల్లా ప్రతినిధి.
Nov 03, 2024.
గంజాయి విక్రయించిన, అమ్మిన కఠిన చర్యలు తప్పవని జగిత్యాల టౌన్ సిఐ వేణుగోపాల్ హెచ్చరించారు. గంజాయి విక్రయించి,అమ్ముతుండగా పట్టుపడ్డ ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి,రిమాండ్ పంపిన అనంతరం ఏర్పాటు విలేకర్ల సమావేశంలో టౌన్ సిఐ వేణుగోపాల్ మాట్లాడుతూ!ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక స్కూటి పై గంజాయి తీసుకువస్తున్నారననే నమ్మదగిన సమాచారం మేరకు,రాజీవ్ బై పాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి దొరికిందని తెలిపారు.పట్టుబడిన వారిలో జక్కుల మధు (24), బాలపెల్లి గ్రామం, జగిత్యాల రూరల్ మండలం, రాచర్ల వంశీ వెంగళయపేట గ్రామం, పెగడపల్లి మండలం, కుక్కల గూడూరు గ్రామం, పాలకుర్తి మండలానికి చెందిన నలిమేల వినోద్ ఉన్నారని పేర్కొన్నారు.రాచర్ల వంశీ మీద గతం లో రెండు గంజాయి కేసులు,నల్లమల వినోద్ మీద గతంలో ఏడు కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయని తెలిపారు.











Leave a Reply