జగిత్యాల / నేటి భారతం :
Nov04,2024
సర్పంచుల మహాధర్నాను అడ్డుకోవడం pe ప్రజా పాలనకు విరుద్ధంమని మాజీ సర్పంచులు అన్నారు. సర్పంచుల మహాధర్నాకు బయలు దేరిన జగిత్యాల జిల్లా లోని, జగిత్యాల మండల పలు గ్రామాల మాజీ సర్పంచులను సోమవారం జగిత్యాల రూరల్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.ఈ సందర్బంగా మాజీ సర్పంచులు మాట్లాడుతూ,గత సంవత్సరం నుండి గ్రామ పంచాయతీలో చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నమని పలుమార్లు ప్రభుత్వానికి వినతులు చేసిన పట్టించుకోలేదన్నారు.ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం ప్రజా పాలన ప్రభుత్వానికి విరుద్దo కదా అని ప్రశ్నించారు. నేడు హైదరాబాద్ లో జరుగుతున్న సర్పంచుల మహాధర్నాకు వెళుతున్న వారిని అరెస్ట్ చేసిన వారిలో జగిత్యాల మండల గ్రామాల మాజీ సర్పంచులు సురకంటి రాజేశ్వర్ రెడ్డి, డెక్క ప్రభాకర్, బుర్ర ప్రవీణ్, చెరుకు జాన్ లు ఉన్నారు.











Leave a Reply