

* అరెస్ట్ లు సబబు కాదు…..!
“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Nov 04, 2024.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన G. O 27 పై పునరాలోచన చేయాలని రా రైస్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు పబ్బ నాగరాజు అన్నారు.రా రైస్ మిల్లర్ ల సమస్యలను తెలుపుకోవడానికి ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్లిన రా రైస్ రాష్ట్ర అధ్యక్షులు పాడి గణపతి రెడ్డి ని పోలీస్ లు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ పబ్బ నాగరాజు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం సాయంత్రం రా రైస్ మిల్లర్లు నిరసన తెలిపారు.ఈ సందర్బంగా నాగరాజు మాట్లాడుతూ, ప్రభుత్వం, రైతులకు మేం వ్యతిరేకం కాదని,G. O no: 27 పై పునరాలోచన చేయాలని కోరారు.మిల్లింగ్ చార్జెస్ ఇతర రాష్ట్రాల్లో రూ ” 120 నుండి 220 ఉన్నాయి,కాని మన రాష్ట్రంలో రూ “10నుండి 30 ఉన్నాయని, అవికూడా గడువు లోపల రైస్ అందించిన వారికే ఇవ్వడం జరుగుతుందన్నారు.ప్రభుత్వమే టెస్ట్ మిల్లింగ్ చేసి, ఓ. టి. ఆర్ నిర్ధారించాలని కోరారు.ఐకేపీ సెంటర్ల నుండి ధాన్యం పాత సంచుల్లో అందించాలన్నారు. మిల్లింగ్ చార్జలు పెంచి, ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రములో రా రైస్ జిల్లా అధ్యక్షులు పబ్బ నాగరాజు, జిల్లా ప్రధానకార్యదర్శి సందుపట్ల రాజిరెడ్డి,రా రైస్ రాష్ట్ర సలహాదారులు గార్రిపెల్లి ప్రభాకర్, చేపూరి శ్రీనివాస్,పురం సత్యంరావ్, ఆంజనేయులు, గౌరీశెట్టి భాస్కర్, సామల మల్లేశం, నగునూరి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply