• పాలకులకు పట్టని “ప్రజారోగ్యం”
• సిస్టమ్ లో గడువు ఉండి, ఓఆర్ఎస్ పాకెట్ పై గడువు ముగిసిన వైనం.
• జిల్లా లో కనిపించని డ్రగ్ ఇన్స్పెక్టర్.
• తనిఖీ లు లేకపోవడంవల్లే రెచ్చి పోతున్న “మెడికల్ మాఫియా”
నేటి భారతం / జగిత్యాల :
Nov 15, 2024.
ప్రజలకు సేవ చేస్తానని ఓట్లు వేయించుకుని, గెలిచి, గద్దెనెక్కాక ప్రజలను, ప్రజారోగ్యాని గాలికి వదిలేసినా పాలకులు. పాలకుల నిర్లక్ష్యం వల్లనే మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది. చివరికి గడువు ముగిసిన మందులను, గడువున్న మందులతో కలిపి అమ్ముతూ,సొమ్ము చేసుకుంటున్నారు.ఇదిలా ఉండగా జగిత్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ మాఫియా “ORS” ప్యాకెట్ లను కూడా వదలడం లేదు.అనారోగ్యం, నీరసం వల్ల,ఓ యువకుడు జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంగడి బజార్ మార్కండేయ కామన్ ఎదురుగా ఉన్న అపోలో ఫార్మసీకి 3 (ORS) ఓఆర్ఎస్ పాకెట్స్ లను కొనడానికి వెళ్ళాడు.కొన్న వాటిని ఇంటికి వచ్చి చూడగా, అందులో 1 (ORS) ఓఆర్ఎస్ పాకెట్ గడువు ఆగస్టు నెలలో ముగిసి ఉండడంతో కంగుతిన్నాడు.(ORS) ఓఆర్ఎస్ పాకెట్లతో అపోలో ఫార్మసీకి వెళ్లి ప్రశ్నించగా సదరు ఫార్మసీ సిబ్బంది మొదట ఆ ఓఆర్ఎస్ పాకెట్ వారి ఫార్మసీ లోనిది కాదని డాబాయించే ప్రయత్నం చేశారు.అపోలో ఫార్మసీలో కొనుగోలు చేసిన ఫోన్ పే ఆధారాలు చూపిన యువకునికి, చూసుకోకుండా ఇచ్చామని, కానీ సిస్టమ్ లో గడువు ఉందని ఓఆర్ఎస్ పాకెట్ పై గడువు ఎలా ముగిసిందో తెలియడం లేదని చెప్పి, చేతులు దులుపుకున్నారు సదరు అపోలో ఫార్మసీ సిబ్బంది.వైద్య పరంగా మూడు, నాలుగు జిల్లాలకు ముఖ్యాకేంద్రంగా ఉంటూ విస్తృత సేవలండిస్తున్న జగిత్యాల పట్టణానికి ప్రతిరోజు వేల మంది ప్రజలు వస్తూ, మందులు కొంటూ వెళుతుంటారని,అలాంటి జనాలకి గడువు ముగిసిన మందులు అమ్ముతూ,లక్షలు పోగేసుకుంటున్న మెడికల్ షాపుల పై జగిత్యాల డ్రగ్ ఇన్ఫెక్టర్ తనిఖీలు చేపట్టి ప్రజలకు నాణ్యమైన, ప్రమాణలు కలిగిన మందులు అమ్మేలా చూడాలని, గడువు తిరిన మందులను అమ్ముతున్న షాప్ లను సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.











Leave a Reply