“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Nov 16, 2024.
2,400 కిలో మీటర్ల ఉన్న గంగా నది కి మోదీ ప్రభుత్వం 40,000 కోట్లు ఖర్చు చేస్తే, కేవలం 55 కిలోమీటర్లు ఉన్న మూసి నది కి లక్షన్నర కోట్లు ఎందుకని BRS సిరిసిల్ల పట్టణ యూత్ అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్ ప్రశ్నించారు.శనివారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సుంకపాక మనోజ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలన బాత్ కరోడోమే కామ్ పకోడోమే అన్నట్టు గా ఉందని ఏద్దేవా చేశారు. పాలమూరు జిల్లా లో రైతులు ఏ విధంగా తిరగ బడ్డారో రాబోయే రోజుల్లో రాష్ట్రo మొత్తం ఇదే పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్ పాలన వలన ప్రజలు విసుగెత్తి పోయారని, అసలు రాష్ట్రం లో పాలన ఉందా లేదా అన్న పరిస్థితి నెలకొందన్నారు. గతంలో పాలమూరు ప్రజలు బ్రతకడానికి వలస వెళ్ళేవారని,BRS ప్రభుత్వం వచ్చాక కెసిఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు వినియోగించుకుంటూ, వ్యవసాయం చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వలసలు వెళ్లే పరిస్థితి కనిపిస్తుందన్నారు.గతంలో తెలుగు రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్, టీడీపీలేనని వారి వైఫల్యం వల్లనే నూటికి నూరుశాతం ‘మూసి’ కలుషితం అయ్యిందని పేర్కొన్నారు.2005 ఆగష్టు లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం GHMC ద్వారా 32కోట్లతో 30 నెలల్లో ‘మూసి’ని శుద్ధి చేయాలనీ పనులు ప్రారంభించి ఆచరణ లో విఫలం అయ్యింది నిజం కాదా అని ప్రశ్నించారు.గత ఎన్నికల ముందు BRS ప్రభుత్వం 13,400 కోట్ల తో మూసి మురుగుని శుద్ధి చేయాలనీ కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారని, దురదృష్టం కొద్దీ BRS ఓడిపోయిందని అన్నారు. 2,400 కిలో మీటర్లు ఉన్న గంగా నది కి మోదీ ప్రభుత్వం 40,000 కోట్లు ఖర్చు చేస్తే, కేవలం 55 కిలోమీటర్లు ఉన్న మూసి నది కి లక్షన్నర కోట్లు అవసరమా అని ప్రశ్నించారు.?హైదరాబాద్ ప్రాంతంలో 1980 నుండి చెరువుల కబ్జాలు ప్రారంభమైయ్యాయని, మరి అప్పుడు ఏ పార్టీ అధికారం లో ఉన్నదో ప్రజలు ఆలోచించాలని కోరారు.ఈ సమావేశంలోBRS జిల్లా నాయకులు మెట్ట రాజు, మునీర్, కత్తెర వరుణ్ కుమార్, మన్సూర్, ఇమ్రాన్, షకీల్ సోను పాల్గొన్నారు.











Leave a Reply