• కేటీర్ వైఖరి చూస్తే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు.
• షాడో ముఖ్యమంత్రిగా 10సం “రాలు నువ్వు చేసింది అరాచకం కాదా…?
• నేరెళ్ల ఘటన దేశాన్ని కూదిపేసినా, కేటీర్ కుటుంబాన్ని కుదిపేయలేదు.
• మిమ్ములను చూసి ప్రజాస్వామ్యమే సిగ్గు పడుతుంది.
“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Nov 16, 2024.
షాడో ముఖ్యమంత్రిగా 10సం “రాలు నువ్వు రైతులు, దళితులు, గిరిజనుల పై చేసింది అరాచకం కాదా.? అని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కె. కె మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. లగచర్ల ఘటన పై సిరిసిల్ల MLA కేటీర్ వ్యాఖ్యలు, తీరును నిరసిస్తూ సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కే కే మాట్లాడుతూ,కేటీర్ తీరును చూస్తే నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు.మీ ఇసుక ధన దాహానికి నేరెళ్ల ఘటన నిలువెత్తు సాక్షం కాదా..?అప్పుడు ప్రాథమిక హక్కులు, పౌరహక్కులు గుర్తుకు రాలేదా.? అని ప్రశ్నించారు.మీ ఇసుక ధన దాహం కోసం, ఇసుక లారీల కింద ఎంత మంది ప్రాణాలు బలైయ్యాయో మరిచి పోయావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.మీ ఇసుక వ్యాపారాన్ని ప్రశ్నించిన దళితులను మీ పోలీస్ లతో చిత్రహింసలు పెడితే, నేటికి వారి పరిస్థితి దయనియంగా ఉందన్నారు.ఖమ్మంలో మిర్చి రైతులను, గిరిజన మహిళలను జైల్లో పెట్టినప్పుడు, సిరిసిల్ల హాస్టల్లో గిరిజన విద్యార్ధి పై ని అనుచరుడు చేసిన అకృత్యానికి పాల్పడ్డప్పుడు పౌరహక్కులు,ప్రాథమిక హక్కులు గుర్తుకు రాలేవా ? ప్రభుత్వాన్ని కూల్చాలే నేను అధికారంలో కూర్చోవాలె ఇదే నీ యావ తప్ప, ప్రజల గురుంచి ఆలోచనే లేదని దుయ్యబట్టారు.మిమ్ములను చూసి ప్రజాస్వామ్యమే సిగ్గు పడుతుందని, కుట్రలు చేయడం మానుకోవాలని లేకుంటే ప్రజలే బుద్ది చెప్పుతారని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ వేల్ముల స్వరూప,పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు కాముని వనిత, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్,గ్రంధాలయ ఛైర్మెన్ నాగుల సత్యనారాయణ, గడ్డం నర్సయ్య, నేరెళ్ల బాధితులు తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply