“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Nov 17, 2024.
మనిషి ఉరుకుల, పరుగుల జీవితంలో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి ఫన్ క్లబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని యోగ ఆచార్యులు ఉప్పల శ్రీనివాస్ తెలిపారు.సిరిసిల్ల పట్టణంలో ని కాలేజీ గ్రౌండ్ లో ఫన్ క్లబ్ నిర్వహించిన అనంతరం ఆచార్యులు ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ,ఫన్ క్లబ్ లో ధ్యానం,ఆటలు, పాటలు,నృత్యాలు ఉంటాయన్నారు.ఆటలు, పాటలు, నృత్యాలతో హ్యాపీ హార్మోన్స్ విడుదలయి శరీరాన్ని, మనసుని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుతాయన్నారు.ఫన్ క్లబ్ లో పెద్దవారు,చిన్న పిల్లల మాదిరిగా ఆటలాడుతూ పాడుతూ వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారని పేర్కొన్నారు. ఈ చర్య మనిషి జీవితం కష్టమైన, నష్టాలైనా, ఆనందమైనా సంతోషమైన ఒక ఆటలాగా గడపడం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ ఫన్ క్లబ్ ప్రతిరోజు విజ్ఞాన వర్ధిని పాఠశాలలో ఉ 5గం, వైశ్య భవనంలో ఉ 5.30 గ, ఇందిరా పార్కులో ఉ 6గం, ప్రతి ఆదివారం నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు.











Leave a Reply