“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Nov 17, 2024.
నేరెళ్ల ఘటన కేటీఆర్ ప్రమేయం లేకుండా జరిగిందని మాజీ సర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షులు మాట్ల మధు అన్నారు.శనివారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కె. కె మాటలను ఖండిస్తూ, సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మధు మాట్లాడుతూ, భాధితులకు అప్పటి ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేసిందన్నారు. నేరెళ్ల ఘటనకు బాద్యులైన వారిని సస్పెండ్ చేసారని గుర్తు చేశారు.K k మహేందర్ రెడ్డి,రేవంత్ రెడ్డి లు నేరెళ్ల బాధితులను రాజకీయంగా వాడుకున్నారే తప్ప, బాధితులకు చేసింది ఎం లేదన్నారు. మా కేటీఆర్ ఎవరికీ అన్యాయం చేసే వ్యక్తి కాదని, కేటీర్ పై చిల్లర మిల్లర మాటలు మాట్లాడితే ఊరుకోమని తెలిపారు.కేటీఆర్ కడిగిన ఆణిముత్యమని,కళ్ళబొల్లి మాటలు మానుకోవాలని హెచ్చరించారు.ఈ సమావేశంలో మాట్ల మధు, వెంగని మనోహర్, సబ్బని హరీష్, కంచర్ల రవి గౌడ్,చిలువెరీ చిరంజీవి, జహంగీర్, గోడిశేలా ఎల్లయ్య, నిరటి బాబు, గుండు ప్రేమాకుమార్ తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply