“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Nov 21, 2024.
ఏ కార్పొరేట్ చదువులు అభ్యసించలేదు. ఏ ట్యూషన్ లకు వెళ్ళలేదు. సర్కార్ బడి, ఇంటి వద్దనే చదువు. అయినా 3 సర్కార్ ఉద్యోగాలతో మెరిసి తన కుటుంబాన్ని మురిపించింది అ విద్య కుసుమం. పూర్తి వివరాల్లోకి వెళితే, రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపెల్లి మండలం, గోపాలరావు పల్లె కు చెందిన ములిగే ఇంద్రజ కు తండ్రి లచ్చయ్య, తల్లి దుర్గర్వ, సోదరుడు, సోదరి ఉన్నారు.నిరుపేద కుటుంబమైన తండ్రి కష్ట పడి కుటుంబాన్ని పోషించాడు. తండ్రి కష్టం చూసి ఎలాగైనా ఉద్యోగం సాధించి, కుటుంబాన్ని అండగా నిలువాలనుకుంది ఇంద్రజ.10వరకు తాడురు జిల్లాపరిషత్ , inter, డిగ్రీ (మాథ్స్ ), స్కాలర్ షిప్ లతో చదివి,PG (మాథ్స్ ) వరంగల్ ku కాంపస్ లో పూర్తి చేసింది.అనంతరం 3ఏళ్ళు కోరుట్లలో ఓ కళాశాలలో JL గా పనిచేస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలో GL, PGT,గురుకుల,tspsc JL సాధించింది. కుటుంబానికి అండగా ఉండాలనే తపన, లక్ష్య సాధన ఉంటే కోరుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చని ఇంద్రజ తెలిపింది.తాను సాధించిన ఉద్యోగాలతో అనేక మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది.











Leave a Reply