క్రీడలు మానసిక ఉల్లాసాన్ని  కలిగిస్తాయి.

Published by

on

దివ్యాంగులతో chess ఆడుతున్న dwo పి. లక్ష్మి రాజ్యం.

“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం):

 రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

 Nov 23, 2024.

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయని రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి పి. లక్ష్మీరాజం అన్నారు.అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలోని దివ్యాంగులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని జిల్లా సంక్షేమ ఆధికారి ,జ్యోతి ప్రజ్వలన చేసి ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ ఆధికారి మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయని తెలిపారు.  భవిష్యత్తులో మరింత శక్తితో ముందుకు వెళ్లడానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. ఆటలతో గ్రామీణ, మండల,జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్ళవచ్చు తెలిపారు.రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంపిక అవడం వలన విద్య, ఉద్యోగ, ఉపాధి లో  మెరుగైన అవకాశాలు లభిస్తాయన్నారు.  అత్యంత ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఉద్యోగాలు, స్పోర్ట్స్ మెరిటోరియస్ స్పెషల్ ప్రకటనలు కూడా ఉంటాయని తెలిపారు. శనివారం క్రిడల్లో బధిర, మానసిక, శారీరక, అంధ, దివ్యాంగులకు క్యారం, షాట్ పుట్, రన్నింగ్, వీల్ చైర్  రన్నింగ్ లాంటి ఆటలను ఆడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సమితి నాయకులు మామిడాల నరేష్, మాదాసు రాజేష్ బాబు, వినయ్,  రాము, శ్రీనివాస్ పరశురాములు, సిడిపిఓ లు ఉమారాణి, సుచరిత, డిహబ్ కోఆర్డినేటర్ రోజా, సఖి అడ్మిన్ పద్మ, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ పరమేశ్వర్, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ సంతోష్, డిస్టిక్ కోఆర్డినేటర్ పోషణ అభియాన్ బాలకృష్ణ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading