అనుచిత వ్యాఖ్యలు చేస్తే గూటం దెబ్బ రుచి చూపకతప్పదు.

Published by

on

విలేకర్ల సమావేశంలో దళిత, msp, mrps నాయకులు.

“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం):

 రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

 Nov 26, 2024.

ఎస్సి వర్గీకరణ పై సుదీర్ఘ కాలం పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ గూర్చి అనుచిత వ్యాఖ్యలు చేస్తే గూటం దెబ్బ రుచి చూపకతప్పదని ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ రుద్రారం రామచంద్ర మాదిగ హెచ్చరించారు. ఎస్సి వర్గీకరణ పై మాలల తీరును,వ్యాఖ్యలను తప్పు పడుతూ,సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో MRPS,MSP రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా,రుద్రారం రామచంద్ర మాదిగ మాట్లాడుతూ,మాలలు మందకృష్ణ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించిదే లేదన్నారు.వర్గీకరణ పై సుప్రీం తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా sc వర్గీకరణ చేస్తానని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, జాప్యం చేయడానికి గల కారణాలు తెలపలన్నారు. అంబేద్కర్ వాదులమని చెప్పుకునే మాలలు 

ముంబైలో అంబేద్కర్ ఇల్లును కూల్చితే ఎక్కడున్నారని, ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రెంజర్ల రాజేష్  మందకృష్ణ  మాదిగ పై అనుచిత వాక్యాలు చేస్తే సహించేది లేదని, అతనికి గూటం దెబ్బ రుచి చూపకతప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు రానున్న ఎన్నికల్లో, మాదిగల ఓట్లు వద్దని ప్రకటన చేసి, ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ చేశారు .రిజర్వేషన్ తో కేంద్రంలో ఉన్నత పదవులు అనుభవించిన వివేక్, sc st అట్రాసిటీ చట్టాన్ని,కేంద్రం నిర్వీర్యం చేసే పనిలో ఉంటే ఎందుకు మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఉష మెహెర కమిషన్, లోకూరు కమిషన్లు మాదిగ, మాదిగ ఉపకులాలకు జరుగుతున్న  అన్యాయాన్ని స్పష్టం గా వివరించినా, ఉన్నత పదవుల్లో ఉన్న మాల నాయకులు ఎస్సి వర్గీకరణకు అడ్డు పడుతున్నారని, ఈ అడ్డు పుల్లలు వేయడం మాని,Sc రిజర్వేషన్ ఫలాలు షెడ్యూల్ కులాల  ప్రజలందరికి అందేలా హుందాగా వ్యవహారించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్సీ జిల్లా అధ్యక్షులు

ఆవునూరి ప్రభాకర్, కానాపురం లక్ష్మణ్ అంబేద్కర్ సంఘాల జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాస్ డైరెక్టర్ కొత్తపల్లి సుధాకర్ లక్ష్మణ్ నేదురి లక్ష్మణ్ మాది ఎంఆర్పిఎస్ నాయకులు గడ్డం కిరణ్ ఇల్లంతకుంట ఇంచార్జ్ రాకేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు నరేష్ తిరుపతి కాష్పాక రాములు పూర్ణచందర్ మాదిగ భరత్ మాదిగ శ్రీనివాస్ మాదిగ అశోక్ మాదిగ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading