సిరిసిల్ల కు బై ఎలక్షన్స్ ఎప్పుడైనా రావొచ్చు..?

Published by

on

“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం):

 రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

 Nov 27, 2024.

సిరిసిల్ల కు బై ఎలక్షన్స్ ఎప్పుడైనా రావొచ్చని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర  సీనియర్ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం అన్నారు. మంగళవారం సిరిసిల్ల లోని brs భవన్ లో ktr మాటలను తీవ్రంగా ఖండిస్తూ, సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అయన మాట్లాడుతూ! ktr ప్రజలను రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని హితావు పలికారు.సిరిసిల్లను జిల్లా గా ఏర్పాటు చేయడం తప్ప, ktr సిరిసిల్లకు చేసింది ఏమిలేదన్నారు.9వ ప్యాకేజీ ముల్కపేట రిజర్వాయర్ ను ఎందుకు నింపలేదని, మిడ్ మానేరు లో ఇళ్ళు కోల్పోయిన వారికీ  కనీసం  ఇళ్ళు ఎందుకు ఇప్పియలేదో చెప్పాలాన్నారు.10ఏళ్ల మీ పరిపాలనలో నువ్వు చేసినంత అధికారం దుర్వినియోగం ఇంకెవ్వరు చేయలేదని, నువ్వా దుర్వినియోగం గురించి మాట్లాడేదని దుయ్యబట్టారు. kcr, ktr, హరీష్ రావు ల పాపాల చిట్టా ఊరువా పంచుతామని,తెలంగాణను వక్కలు ముక్కలు చేసుకొని తిన్నారని,మీ ఆట ముగిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు . 1సం “రానికే ఇంత ఆగమైతే 4 ఏళ్లల్లో మీరెక్కడుంటారోనని, ఇకనైనా ప్రేలాపనలు మానుకోవాలని లేదంటే బుద్ది చెప్పక తప్పదని తెలిపారు.

Leave a Reply

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading