3 రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు.

Published by

on

విలేకర్ల సమావేశంలో AMC సభ్యులు.

“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం):

 రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

 Nov 29, 2024.

కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం సేకరించిన 3రోజుల లోపే వారి ఖాతాలో డబ్బులు జమైతున్నాయని సిరిసిల్ల  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప అన్నారు.శుక్రవారం సర్దాపూర్ లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చైర్పర్సన్ వెలుముల స్వరూప మాట్లాడుతూ,ప్రభుత్వం హామీ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అర్హులైన రైతులందరికి 2లక్షల రుణమాఫి చేసారన్నారు.ఈ మార్కెట్ పరిదిలో 37ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, గత ప్రభుత్వం కంటే 50వేల క్వింటల్ ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు.ధాన్యం కొనుగోలు చేసిన రైతుల కు 3రోజుల లోపే వారి ఖాతాలో డబ్బులు జామచేశామని పేర్కొన్నారు.వరి వేస్తే ఉరేనని గత పాలకులు అంటే, వరిని పండించి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపామన్నారు.కాళేశ్వరం నీళ్లు లేకుండానే వరిని పండిచామని, మహబూబ్ నగర్ లో ఈ నెల 28,29,30 లలో రైతు పండగలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా పాలనలో 3పశువులున్న రైతులకు  80 వేలతో షెడ్ వేసి ఈ ప్రభుత్వం అందిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని వారు కోరారు.వైస్ చైర్మన్ నేరెళ్ళనర్సయ్య,సభ్యులు నక్క నర్సయ్య,పొన్నాల పర్శరాములు, ఇట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అనుముల శైలజ, కల్లెపల్లి ఆరుపతి రెడ్డి, గుగ్గిల్లరాములు,దుబాల వెంకటేశం,గంగు కొండయ్య, మహమ్మద్ ఖాజా మెయినొద్దీన్, ఆరెపల్లి బాలచందర్, చేపూరిశ్రీనివాస్,ఆడెపు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading