*జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.
డిసెంబర్ 01/25 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
శాంతి భద్రతల దృశ్య రాజన్న సిరిసిల్ల జిల్లా లో పోలీసు యాక్ట్( పోలీస్ యాక్ట్ 1861) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,పోలీస్ యాక్ట్ డిసెంబర్1 నుండి 31 వరకు ఉంటుందని పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు,రాస్తా రోకోలు,నిరసనలు,ర్యాలిలు,పబ్లిక్ మీటింగ్ లు,సభలు,సమావేశాలు నిర్వహించరదాని తెలిపారు.నిబంధనలకు విరుద్దoగా డి.జే లు వినియోగించారాదని సూచించారు. శాoతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.











Leave a Reply