డిసెంబర్ 19/25 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
డిసెంబర్ 24న ప్రభుత్వ పెన్షనర్ల నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు రిటైర్ ఎంప్లాయస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మల్లారపు పురుషోత్తం తెలిపారు.ఈ సందర్బంగా సిరిసిల్ల లో ఏర్పాటు చేసినసన్నాహ సమావేశంలో ఆయన మాట్లాడుతూ,2024 నుండి నేటి వరకు 21 మాసములు గడిచిన, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వము నుండి ఏలాంటి బకాయిలు చెల్లించలేదన్నారు.ప్రభుత్వ ఉదాసినత వల్ల రాష్ట్రంలో వివిధ జిల్లాలో దాదాపు 32 మంది రిటైర్డ్ ఉద్యోగులు మానసిక ఆవేదనకు లోనై మరణించారని తెలిపారు.బకాయిల చెల్లింపు విషయమై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్న, ధర్నా కార్యక్రమాలు చేసిన, నిరసన కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంయుక్త కార్యచరణ సమితి పిలుపుమేరకు ఈనెల 24న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే నిరాహారదీక్షకు బకాయిలు రాని రిటైర్డ్ ఉద్యోగస్తులు, సర్వీస్ ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు, పెన్షనర్స్ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రేవా జిల్లా ప్రధాన కార్యదర్శి ధ్యానపల్లి పరమేష్, జిల్లా ఉపాధ్యక్షులు వంగ సుధాకర్ , జిల్లా కార్యవర్గ సభ్యులు కుబేర స్వామి, ప్రభాకర్ ఎస్.ఆర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply