డిసెంబర్ 20/25 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
కల్లోల ప్రాంతాలైన కోనరావుపేట, ఎల్లారెడ్డి పేట, వీరన్నపల్లి, చందుర్తి మండలాలల్లో కంచుకోటలు బద్ధలవుతున్నాయి.ఆయుధాన్ని చేతిన పట్టి అన్నలు దొరలను తరిమితే,ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్య పద్ధతిలో దొరల కంచుకోటలను బద్దలు కొట్టారు నేటి యువత.మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కోనరావుపేట మండలంలోని నాగారం, మల్కాపేటలో దొరలను, దొర మద్దతును కాదని బి.సిలను గెలిపించి బి.సి లకు సర్పంచ్ పదవితో పట్టం కట్టారు.ఎల్లారెడ్డి పేట, వీరన్న పల్లి,చందుర్తి మండలాలల్లో జనరల్ స్థానాలల్లో ఆధిపథ్య కులాలకు పోటీగా నిలుచుని బి.సి56, ఎస్సి4, ఎస్టీ7 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నారు. నిన్న, మొన్నటి దాక దొర ఆదేశించాడనో, పటేల్ చెప్పాడనో ఓట్లు వేసే ఎస్సి, ఎస్టీ, బి.సి వర్గాల ప్రజలు, స్వతంత్రంగా ఆలోచించగలరని, ప్రభుత్వాలను నడిపే సమర్థ్య వారిలో కూడా ఉందని ఓట్ల తో తెలియజేసారు.ఏది ఏమైనా సమాజంలో మార్పుకు ఇది మరో అడుగని, రానున్న ఎన్నికలు ఆధిపథ్య కులాలకు పలు సవాళ్ళను విసురుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.











Leave a Reply