

డిసెంబర్ 21/25 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
లోక్ అదాలత్ లో సత్వర న్యాయ పరిస్కారం జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు.ఆది వారం జిల్లా కేంద్రంలోని కోర్ట్ ఆవరణలో జరిగిన లోక్ అదాలత్ లో 17,724 కేసులను పరిష్కరించి, కక్షి దారులకు రూ.1,79,82,998/- లను నష్ట పరిహారం అందజేసినట్లు వారు పేర్కొన్నారు. రాజీ మార్గం ద్వారా ఎంతటి సమస్యనైనా పరిష్కారించుకోవచ్చని వారు తెలిపారు.ఈ లోక్ అదాలత్ లో మోటార్ వాహన ప్రమాద కేసులు 03,సివిల్ తగాదాలు 16, క్రిమినల్ కేసులు 398, ఎక్సైజ్ కేసులు 33,చెక్ బౌన్స్ కేసులు 11, కుటుంబ తగాదాలు01,గృహహింస06,భూ సేకరణ కేసులు02,బ్యాంకు కేసులు 09,డ్రంక్ అండ్ డ్రైవ్1725, ట్రాఫిక్ చలాన్ కేసులు 15,508 ఈ -పెట్టీ కేసులు 12 ఉన్నట్లు వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, అదనపు ఎస్పీ డి.చంద్రయ్య, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవధికార సంస్థ ఇంచార్జ్ కార్యదర్శి పి.లక్ష్మణాచారి, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్, ఇతర న్యాయవాదులు, పోలీసులు, బ్యాంకు అధికారులు,కక్షిదారులు పాల్గొన్నారు.











Leave a Reply